క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్:- ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కోచ్-ఫ్రాంచైజీ బంధానికి తెరపడింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హెడ్ కోచ్‌గా సుదీర్ఘకాలం పాటు అద్భుతమైన సేవలు అందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చెన్నై సూపర్ కింగ్స్‌తో 18 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది.ఆటగాడిగా అరంగేట్రం: ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన 2008లో ఫ్లెమింగ్ CSK జట్టులో ఆటగాడిగా చేరారు.
ప్రెగ్నెన్సీ టైంలో సమంతకు అరుదైన బాక్సాఫీస్ ఘనత..!
కోచ్‌గా బాధ్యతలు:- ఆ మరుసటి సంవత్సరమే అంటే 2009 నుండి ఆయన జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి నిలకడైన ప్రణాళికలతో జట్టును విజయపథంలో నడిపించారు.ఎంఎస్ ధోనీ సారథ్యం, ఫ్లెమింగ్ వ్యూహాల కలయికతో CSK టోర్నమెంట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన చెన్నై జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించారు. ఫ్లెమింగ్ పర్యవేక్షణలో CSK ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. వీటితో పాటు రెండు సార్లు ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నమెంట్లలో జట్టును విజేతగా నిలిపారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి, చెన్నై సూపర్ కింగ్స్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు ఫ్రాంచైజీ యాజమాన్యం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.