Homeక్రైమ్ప్రేమ వివాహానికి అడ్డుగా నిలిచిందని అత్తని గొడ్డలితో చంపిన అల్లుడు.. కూతురు కళ్లముందే దారుణ హత్య

ప్రేమ వివాహానికి అడ్డుగా నిలిచిందని అత్తని గొడ్డలితో చంపిన అల్లుడు.. కూతురు కళ్లముందే దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌లోని బాండా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిందనే కారణంతో ఓ మహిళను ఆమె అల్లుడు అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాను (45) అనే మహిళకు తన కూతురు గుల్ పర్వీన్ ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. దీన్ని ఆమె ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. గుల్ పర్వీన్ వేరే మతానికి చెందిన లవ్‌కుష్ వర్మను ప్రేమించి ఆరు నెలల క్రితం వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

ఈ క్రమంలో గుల్ పర్వీన్ తన కుటుంబం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు చేసి తిరిగి వస్తున్న సమయంలో లవ్‌కుష్ వర్మ బానుపై దాడి చేసినట్లు సమాచారం. గొడ్డలితో విచక్షణారహితంగా దాడి జరపడంతో బాను స్పాట్‌ లోనే ప్రాణాలు కోల్పోయింది.

అంతటితో ఆగకుండా తన భార్య గుల్ పర్వీన్‌పై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రేమ వివాహం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన బాండా జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది.

also read: బస్సులో ప్యాంట్ జిప్ విప్పి అసభ్య ప్రవర్తన.. చెంప పగలగొట్టిన యువతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు