Homeక్రైమ్భార్య ముక్కు కోసేసిన భర్త... ప్రతీకారంతో భర్త సోదరిని ఏం చేశారంటే!

భార్య ముక్కు కోసేసిన భర్త… ప్రతీకారంతో భర్త సోదరిని ఏం చేశారంటే!

  • లఖింపూర్ ఖేరిలో దారుణ ఘటన.. ఇరువర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లాలన్న విషయంపై జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ ముక్కు కోల్పోగా, ఆ తర్వాత జరిగిన ప్రతీకార దాడిలో మరో మహిళ కూడా గాయపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రీతి అనే మహిళ తన బంధువుల పెళ్లి కార్యక్రమానికి వెళ్లేందుకు భర్త శ్రావణ్‌ను అనుమతి కోరింది. అయితే ఈ విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. గొడవ తీవ్రరూపం దాల్చడంతో భర్త దాడి చేయగా, ప్రీతి ముక్కుకు తీవ్ర గాయమైంది.

ఈ విషయం తెలుసుకున్న ప్రీతి కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రతీకారంగా శ్రావణ్ సోదరి మోనిపై దాడి చేసి ఆమె ముక్కును గాయపరిచినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అనంతరం ఇరుపక్షాలు పోలీసులను ఆశ్రయించాయి. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. గాయపడిన ఇద్దరు మహిళలకు వైద్య చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు.

also read: కోపమే కొంప ముంచింది… మొబైల్‌ తో కొట్టడం వల్ల ప్రాణం కోల్పోయిన భర్త… ఒడిశాలో షాకింగ్ ఘటన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు