Homeక్రైమ్షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక మలుపు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య

షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక మలుపు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురి హత్యలతో సంచలనం సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ మృతిచెందాడు. పోలీసుల గాలింపు కొనసాగుతున్న సమయంలో కొత్తూరు మండలం పెంజర్లలో అతడి మృతదేహం లభ్యమైంది. పక్కనే విష పదార్థం ఉన్న బాటిల్‌ ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

జూలై 10 అర్ధరాత్రి షాబాద్ పరిధిలో రాజ్‌కుమార్ వరుసగా ఆరు హత్యలకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. భార్య, పిల్లలతో పాటు మరో కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా హతమార్చిన అనంతరం అతడు పరారయ్యాడు.

పోక్సో కేసు కక్షతోనే దారుణం

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. తనపై నమోదైన పోక్సో కేసు విషయంలో కక్ష పెంచుకున్న రాజ్‌కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మొదట షాబాద్‌లో ఓ బాలిక తల్లి, నాయనమ్మపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం బాలికను మరో ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి భార్య, కుమారుడిని కూడా చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన తర్వాత నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

12 పోలీస్ బృందాలతో గాలింపు

రాజ్‌కుమార్ ఆచూకీ కోసం పోలీసులు తెలంగాణతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు సమాచారం ఇచ్చిన వారికి రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు. హత్యల అనంతరం తండ్రికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పిన రాజ్‌కుమార్.. ఆ తర్వాత రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పెంజర్లలో మృతదేహం లభ్యం

గాలింపు కొనసాగుతున్న సమయంలో కొత్తూరు మండలం పెంజర్లలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా అది రాజ్‌కుమార్ మృతదేహంగా పోలీసులు నిర్ధారించారు.
ఆరుగురి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనలో నిందితుడి మరణంతో కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నప్పటికీ, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

also read: రూ.150 అప్పు.. లక్షల్లో ఖర్చు.. 45 ఏళ్ల కోర్టు పోరాటం! చివరికి తీర్పు ఇలా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు