Homeఆంధ్ర ప్రదేశ్2027 మార్చి నాటికి పోలవరం పూర్తి.. జాతికి అంకితం చేస్తామన్న సీఎం చంద్రబాబు!

2027 మార్చి నాటికి పోలవరం పూర్తి.. జాతికి అంకితం చేస్తామన్న సీఎం చంద్రబాబు!

క్రైమ్ మిర్రర్,అమరావతి</strong:- ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.తూర్పు గోదావరి జిల్లా పిచ్చుకలంకలో ధవళేశ్వరం బ్యారేజీకి చెందిన 117 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతితో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘లెనిన్’ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. భావోద్వేగానికి లోనైన అఖిల్ అక్కినేని!

గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సీఎం:- పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2019 తర్వాత వచ్చిన గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఒకవేళ గతంలో టీడీపీ ప్రభుత్వమే నిరంతరాయంగా కొనసాగి ఉంటే, అనుకున్న ప్రణాళిక ప్రకారం 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని సీఎం గుర్తుచేశారు.ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని వివరిస్తూ, ఇప్పటివరకు పోలవరం పనులలో 89 శాతం పనులు పూర్తయినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మిగిలిన పనులను కూడా శరవేగంగా పూర్తి చేసి, నిర్దేశిత గడువులోగా (మార్చి 2027) ప్రాజెక్టును సిద్ధం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.ఈ పర్యటనలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఆధునీకరణ పనులను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు.

బయటపడిన మావోయిస్టుల భారీ డంప్.. భారీగా ఆయుధాలు, నగదు, బంగారం స్వాధీనం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు