విశాఖపట్టణం, క్రైమ్‌మిర్రర్: సోషల్ మీడియా.. అదో నిరంతర ప్రవాహం. వింతల నుంచి విశేషాల వరకూ.. యుద్ధాల నుంచి సినిమాల వరకూ.. నిత్యం ఎన్నో పోస్టులు, వేలకొద్దీ వీడియోలు.. ఇక ఇందులో ప్రకృతి గురించి, ప్రకృతి అందాల గురించి ఎన్నో విశేషాలను షేర్ చేస్తుంటారు. అలా షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చూడగానే వావ్ ఎక్కడిదీ స్పాట్ అని అనకుండా ఉండలేం.. దాని గురించి ఆరా తీసిన తర్వాత ఓసారైనా వెళ్లొద్దామని మనసు లాగడం ఖాయం. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే బ్రిడ్జ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని మోతుగూడెంలో ఉంది ఈ వంతెన.
Also Read:పదవిలో హోదా.. పనిలో సాదాసీదా.. విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ హరిత
మోతుగూడె ఫోర్‌బే డ్యామ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు.లోయర్ సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులో భాగంగా మోతుగూడెం ఫోర్‌బే డ్యామ్ నిర్మించారు. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు.. పచ్చదనం పరుచుకున్న వాతావరణం మధ్య ఉన్న ఈ డ్యామ్.. ప్రకృతి ప్రియులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రకృతి అందాలను చూసి సినిమా డైరెక్టర్లు కూడా ఇక్కడ షూటింగ్‌లు జరుపుతుంటారు. ఇక పుష్ప సినిమా షూటింగ్ తర్వాత.. మోతుగూడెం ఫోర్ బే డ్యామ్ బ్రిడ్జ్ కాస్తా..పుష్ప బ్రిడ్జ్‌గా పేరు తెచ్చుకుంది. పుష్ప సినిమాలోని కొన్ని సీన్లను ఇక్కడ చిత్రీకరించడంతో.. సినిమాతో పాటుగా ఈ ప్రాంతం కూడా బాగా పాపులర్ అయ్యింది.
Also Read:మిడ్‌డే మీల్‌లో తేలు కలకలం.. 100కి పైగా విద్యార్థులు అస్వస్థత, బీహార్‌లో ఆందోళన
అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగింది.చుట్టూ లక్కవరం అటవీ ప్రాంతం, పచ్చని కొండల మధ్య సాగే మార్గం.. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఇక కరెంట్ ఉత్పత్తి తర్వాత డొంకరాయి డ్యామ్ నుంచి పవర్ కెనాల్ ద్వారా నీరు ఈ డ్యామ్‌లోకి చేరుతుంది. ఆ సమయంలో ఈ డ్యామ్ మరింత అందాన్ని సంతరించుకుంటుంది. ఇక ఈ ఫోర్ బే డ్యామ్‌కు కొద్ది దూరంలో పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దీంతో ఈ రెండింటినీ కలిపి చూసేందుకు ఎక్కువమంది పర్యాటకులు వస్తుంటారు. అయితే నీటిని విడుదల చేసిన సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నా