కందుకూరు మండలంలో సీలింగ్ భూముల క్రయ- విక్రయాలు..!?

0
13
కందుకూరు మండలంలో సీలింగ్ భూముల క్రయ- విక్రయాలు..!?
కందుకూరు మండలంలో సీలింగ్ భూముల క్రయ- విక్రయాలు..!?
  • పెద్దమ్మ తండాలో 28 ఎకరాల సీలింగ్ భూముల కొనుగోలు ఆరోపణలు

క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి నిఘా : కందుకూరు మండలంలోని పులిమామిడి రెవెన్యూ పరిధి పెద్దమ్మ తండాలో సీలింగ్ భూముల క్రయ – విక్రయాలు జరిగినట్లు ఆరోపణలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది. సర్వే నంబర్లు 74, 75లోని సుమారు 28 ఎకరాల సీలింగ్ భూములను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం.

Also Read:ఉచిత పథకాలపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు

భూ సీలింగ్ చట్టం ప్రకారం ఇలాంటి భూములను రైతులు సాగు చేసుకునే హక్కు మాత్రమే కలిగి ఉంటారని, వాటిని విక్రయించడం లేదా కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ భూముల్లో రియల్ వెంచర్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది.

Also Read:విజయసాయిరెడ్డి పొలిటికల్ సైలెన్స్…!

ఈ వ్యవహారంపై స్పందించిన తహసీల్దార్, సీలింగ్ భూములను విక్రయించడం, కొనుగోలు చేయడం రెండూ చట్టవిరుద్ధమేనని, నిబంధనలను ఉల్లంఘించిన రైతుల పట్టాలను రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అలాగే అక్రమంగా కొనుగోలు చేసిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.

Also Read:అర్ధం కానీ జగన్ వ్యూహం

కందుకూరు మండల పరిధిలో సీలింగ్ భూముల క్రయ, విక్రయాల వెనుక ఉన్న వాస్తవాలు, సంబంధిత పత్రాలు, పూర్తి ఆధారాలతో కూడిన సమగ్ర ప్రత్యేక కథనం రేపటి సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here