Homeతెలంగాణబాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కారు, ఆటో ధ్వంసం..

బాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కారు, ఆటో ధ్వంసం..

క్రైమ్ మిర్రర్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. బస్సు వేగంగా బంకు ప్రాంగణంలోకి చొచ్చుకురావడంతో అక్కడ నిలిపి ఉంచిన కారు, ఆటో తీవ్రంగా దెబ్బతిన్నాయి. బస్సు ఒక్కసారిగా బంకులోకి దూసుకురావడంతో అక్కడ ఉన్న సిబ్బంది, పరిసరాల్లోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో పెట్రోల్ బంకు వద్ద జనసంచారం తక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం తీవ్రతకు బంకు వద్ద ఉన్న వాహనాలు దెబ్బతిన్నాయి. బస్సు అదుపుతప్పి బంకులోకి దూసుకెళ్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. బస్సు అదుపుతప్పడానికి కారణం డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడమా, యాంత్రిక లోపమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు