Homeసినిమాచిరంజీవి ‘కాకా’ స్టోరీ ఇదేనా? నెట్టింట వైరల్ అవుతున్న కథనం..!

చిరంజీవి ‘కాకా’ స్టోరీ ఇదేనా? నెట్టింట వైరల్ అవుతున్న కథనం..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా ‘కాకా’ కథకు సంబంధించి ఓ స్టోరీ లైన్ నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన కూతురిగా మలయాళ నటి అనసూయ రాజన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర మెడికల్ స్టూడెంట్‌గా ఉండనుందని టాక్. తండ్రి-కూతుళ్ల అనుబంధం, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ అంశాల చుట్టూ కథ సాగుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కెరీర్‌లోనే గుర్తుండిపోయేలా ఫ్లాష్‌బ్యాక్ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు బాబీ రూపొందించినట్లు సమాచారం. అయితే వైరల్ అవుతున్న ఈ స్టోరీ లైన్‌పై చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

మరోవైపు ‘కాకా’ వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా గ్రాస్ సాధించి మరో ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందని కొందరు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

also read: KBCకి అమితాబ్ బచ్చన్ గుడ్‌బై? రిటైర్‌మెంట్‌పై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు