Homeఆంధ్ర ప్రదేశ్పవన్‌ మార్క్‌ పోలీసింగ్‌.. హోంశాఖపై వ్యాఖ్యలు వెనుక మర్మం అదేనా.!

పవన్‌ మార్క్‌ పోలీసింగ్‌.. హోంశాఖపై వ్యాఖ్యలు వెనుక మర్మం అదేనా.!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఏపీలో పోలీసింగ్‌ ఇకపై మారనుందా.? పవన్‌ మార్క్‌ పోలీసింగ్‌ ప్రారంభం కానుందా.? అంటే అవున్న సమాధానమే వినిపిస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన చేతిలో హోంశాఖ లేదంటూనే.. తన చేతిలో ఉంటే ఏం చేస్తానన్న విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు పవన్‌ కల్యాణ్‌ తూతూ మంత్రంగా చేసినవి కాదని చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ తన భవిష్యత్‌ కార్యాచరణను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలను చేసినట్టు చెబుతున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా పవన్‌ కల్యాణ్‌ను బాధ్యుడిని చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ సామాజికవర్గాన్ని ఆయా ఘటనల్లో ఇమిడిస్తూ ఆయనపై కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలకు చెక్‌ చెప్పడంతోపాటు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయాన్ని పవన్‌ కల్యాణ్‌ తీసుకున్నట్టు తెలిసింది. ఇందుకు హోంశాఖ అత్యంత కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న భావనతో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత మహిళ కావడంతో ఆమె కాస్త సున్నితత్వంతో వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. అదే తనలాంటి వారికి ఇస్తే రాష్ట్రంలో పోలీసులకు విస్తృత అధికారాలను అందించి పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా పని చేసుకునేలా చేయగలిగితే చాలా వరకు సంఘ విద్రోహక చర్యలు, నేరాలను అదుపు చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హోంశాఖపై తనకు ఉన్న ఆసక్తిని బహిరంగంగానే తెలియజేశారు.

పవన్‌ కోరుకుంటే సీఎం కాదంటారా.?

పవన్‌ కల్యాణ్‌ తన నోటి నుంచే బహిరంగ వేదికపైనే ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ చూస్తున్న పంచాయతీరాజ్‌ శాఖలో కీలక మార్పులను చేశారు. అనేక గ్రామాల్లో వేలాది కిలో మీటర్లు రహదారులు, సీసీ రోడ్లు వేయించారు. జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్‌ తన పేరుతో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన హోంశాఖపై ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈశాఖ తన పరిధిలో ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న అనేక నేరాలపై తనదైన శైలిలో స్పందించేందుకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి ఎదురవుతున్న దాడిని బలంగా ఎదుర్కోవడంతోపాటు అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వారికి అడ్డుకట్ట వేయడానికి ఈ శాఖ ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు చెప్పి శాఖను మార్పించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ హోంశాఖను కోరితే చంద్రబాబు నాయుడు కాదనే పరిస్థితి ఉండదు. కొద్దిరోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వవస్థీకరణకు సిద్ధమవుతున్నారు. అప్పుడు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంత్రిత్వశాఖను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి పవన్‌ కోరుకుంటున్నట్టు హోంశాఖ తన చేతికి వస్తుందా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు