క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయం:- ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయంలో తప్పు జరిగితే ఇక అంతే అంటూ ఇరాన్‌ను హెచ్చరించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. హార్ముజ్‌ను మూసివేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా ట్రంప్ తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈసారి ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామంటూ స్పష్టం చేశారు. లెబనాన్‌పై ఇరాన్ దాడులు తక్షణమే ఆపాలని, లేకపోతే ఈసారి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. డీల్ కుదిరితే ఆ జలసంధి తమ ఆధీనంలోకి తీసుకుంటామన్న ట్రంప్.. హార్ముజ్ వద్ద ఇకపై టోల్ ఫీజు కూడా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. గత వారం ఇరాన్‌పై అమెరికా చేసిన దాడిని గుర్తు చేస్తూ.. లెబనాన్‌లో ఇరాన్ తమ అధిక వేతనాలతో నడిపే ప్రాక్సీలను వెంటనే ఆపాలన్నారు. ఒకవేళ అలాగే కొనసాగిస్తే తీవ్రమైన దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. లెబనాన్‌లో ఇబ్బందులు సృష్టిస్తున్న ప్రాక్సీలను ఇరాన్ తక్షణమే ఆపాలని, అలా చేయకపోతే గతవారం చేసినట్టే మరింత తీవ్రంగా ఇరాన్‌ను దెబ్బ కొడతామని హెచ్చరించారు.
ప్రారంభమైన శాంతి చర్చలు..
ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు స్విట్జర్లాండ్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ప్రారంభమైన ఈ చర్చల్లో కీలకమైన నేతుల పాల్గొన్నారు. అమెరికా తరఫున జేడీ వాన్స్‌తోపాటు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాప్ ఉండగా, ఇరాన్ తరఫున విదేశాంత మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ప్రధాన చర్చల ప్రతినిధి ఎంబీ గాలిబాప్ నేతృత్వంలో బృందం పాల్గొంది. ఈ చర్చలకుపాకిస్థాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాలకు చెందిన ముఖ్య అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు కూడా భాగస్వాములు ఉన్నాయి. ఇకపోతే, ఈ చర్చలను ఉద్ధేశించి ఆమెరికాఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చలును చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను కొత్త దిశగా మల్చుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.