హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ కాలేజ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు విద్యార్థులు బైక్‌పై ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో మరో ద్విచక్ర వాహనాన్ని దాటేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు బైక్‌పై ఉన్న ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read: 15 అడుగుల కొండచిలువ దాడి.. మహిళా రైతుకు తృటిలో తప్పిన ప్రాణాపాయం
