Homeతెలంగాణభాగ్యనగరానికి ట్రాఫిక్ ముప్పు...!

భాగ్యనగరానికి ట్రాఫిక్ ముప్పు…!

  • వన్ వే తో సరిపెడుతున్న వైనం

  • కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్ పాసేజ్ లు లేనట్టే

  • ఎలివేటెడ్ కారిడార్ మాత్రమే..

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీ ఉన్న ప్రాంతం కేబీఆర్ పార్క్. దాని చుట్టూ బృహత్తర ఫ్లైఓవర్ నెట్వర్క్ ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలు పెట్టింది.

దాదాపు 1100 కోట్ల రూపాయల వ్యయంతో కేబీఆర్ పార్కు పరిసరాల్లోని ఆరు ప్రధాన జంక్షన్లో వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల పనులకు ప్రణాళికలు రచించారు. ఆ పనుల కోసం ప్రయోగాత్మకంగా క్లాక్ వైజ్ వన్ వే ట్రాఫిక్ విధానం అమలు చేస్తున్నారు.

కానీ ఇప్పుడు వన్ వే టు ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమయ్యాయి. దీంతో మెగా ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. కేవలం ఒక్క ఎలివేటెడ్ కారిడార్ మాత్రమే ముందుకు తీసుకెళుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి అయితే ఓకే. భవిష్యత్తులో నగరంలో ట్రాఫిక్ పెరిగితే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్న.

  • పెరుగుతున్న వాహన రద్దీ..

వాస్తవానికి హైదరాబాద్ మహానగరంలో ప్రతి నెల వేల సంఖ్యలో వాహనాలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ దానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ పెరగడం లేదు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి హై ఎండ్ ఏరియాలో రోడ్లను మరింత వెడల్పు చేసేందుకు స్థలం లభ్యం కావడం లేదు.

ఐటి కారిడార్ తో కూడిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లను కోర్ సిటీతో కలిపే ప్రధాన వారధి కేబీఆర్ పార్క్ జంక్షన్. రానున్న ఐదు లేదా 10 ఏళ్లలో నగర జనాభా, వాహనాల రద్దీ మరింత రెట్టింపు అయినప్పుడు.. ప్రస్తుత రోడ్డు స్థాయిపై ఆధారపడిన వందే వ్యవస్థ ఆ లోడ్ ను పట్టుకోగలదా? అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.

రేపు వాహనాల రద్దీ పెరిగి మళ్ళీ గంటల తరబడి ట్రాఫిక్ జాములు మొదలైనప్పుడు… కొత్తగా ఫ్లైఓవర్లు లేదా అండర్ పాస్ ల ఆలోచన చేయకుండా ఉండగలమా అనేది ఆలోచించాల్సిన విషయం.

  • దీర్ఘకాలిక ప్లానింగ్ అవసరం..

అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు దీర్ఘకాలిక అర్బన్ ప్లానింగ్ చాలా అవసరం. రోడ్లను వెడల్పు చేసే విసులుబాటు లేనప్పుడు.. గగన స్థలంలో ఫ్లైఓవర్లు, భూగర్భంలో అండర్ పాస్ ల ద్వారా గ్రేడ్ సపరేటర్లను నిర్మించడమే ఏకైక మార్గం. కానీ ఇప్పటికిప్పుడు నిధులు కొరతతోనో, చెట్ల తొలగింపు వివాదాలు, విఐపి ల ప్రయోజనాల ఒత్తిడితోనో ప్రాజెక్టును రద్దు చేసుకుంటే.. రేపటి రోజున మళ్లీ ఇదే నిర్మాణాలను చేపట్టాల్సి వస్తే ఖర్చు రెట్టింపు అవుతుంది.

మరింత తీవ్రమైన ట్రాఫిక్ అస్తవ్యస్త నగరంగా భరించాల్సి వస్తుంది. ఇప్పటికే రోడ్లు ఇరుకుగా మారిపోతుంటే.. వందే మార్గంలో కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి రావడం వల్ల పెట్రోల్ భారం, సమయం వృధా కావడం ఖాయం. అందుకే శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అర్బన్ పాలసీని అమలు చేస్తే బాగుంటుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు