Homeతెలంగాణడ్రైనేజీల మధ్యలోనే కరెంట్ స్తంభాలు..!

డ్రైనేజీల మధ్యలోనే కరెంట్ స్తంభాలు..!

  • అభివృద్ధికి ఆటంకంగా నాసిరకం పనులు

  • నేరేడుచర్ల మున్సిపాలిటీలో కోట్ల డెవలప్మెంట్ పనులకు కొరవడిన పర్యవేక్షణ

  • ఇదే అదనుగా రెచ్చిపోతున్న కాంట్రాక్టర్లు!

  • ధనార్జనే ధ్యేయంగా కాంట్రాక్టర్లు

  • మంత్రి ఉత్తమ్ పుర అభివృద్ధి ఆశయాలకు తూట్లు

  • నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

  • ఇలాగైతే పుర అభివృద్ధి కష్టమే అంటున్న నెటిజన్లు

క్రైమ్ మిర్రర్, నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ లో డెవలప్మెంట్ వర్క్స్ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీలో డ్రైనేజీల నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడుతోందనే విమర్శలు వస్తున్నాయి. డ్రైనేజీల మధ్యలోనే కరెంట్ స్తంభాలు ఉంటున్నాయి.

చెత్తాచెదారం వస్తే ఆ స్తంభాలకు తట్టుకుని మురుగు నీరు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి నెలకొంది.ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.పురపాలక లోని చింతబండ నుండి నేరేడుచర్ల జాన్పహాడ్ ఆర్ అండ్ బీ రోడ్డు వరకు ఇటీవల వేసిన బీటీ రోడ్డు ప్రక్కన నిర్మించిన డ్రైనేజ్ కాలువ నిర్లక్ష్య ధోరణికి పరాకాష్టగా మారింది.

అది కాస్త కరెక్ట్ గానే జరిగిన నిర్మాణాలలో గమ్మత్తు జరిగింది. అక్కడ ఉన్న వీధి దీపాల విద్యుత్ స్తంభాలను మాత్రం మురికి కాలువ మధ్యలోనే ఉంచి నిర్మించారు. ఇది చూసిన వారంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. మురికి మీరు పారేదేలా అంటూ.? నిర్మాణాలు చేసిన వారి నిర్లక్ష్యం పై గుసగుసలాడుకుంటున్నారు.

గతంలోను ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉన్న డ్రైనేజ్ దోరణి అలాగే ఉందని క్రైమ్ మిర్రర్ లో కథనం వచ్చిన నేటికి పరిష్కారం శూన్యం.. కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన పరిస్కరిస్తాం అని పేపర్ స్టేట్ మెంట్ ఇచ్చి కన్నెత్తి చూడకపోవడం శోషనీయం. ప్రస్తుత పాలకులు, అధికారులు అయినా స్పందించి సమస్యను పరిష్కరిస్తారా.. లేదా… వేచి చూడాలి.

డ్రైనేజ్ సమస్యను పరిస్కరిస్తాం.. మున్సిపల్ కమిషనర్ నాగరాజు

డ్రైనేజ్ నిర్మాణం నేను రాకముందే పూర్తయింది.ఈ మధ్యనే సమస్య నా దృష్టికి వచ్చింది, కాంట్రాక్టర్ ఆకస్మిక మరణం వలన సమస్య పరిష్కారానికి సమయం పడుతుంది. మున్సిపల్ చైర్మన్ తో మాట్లాడి విద్యుత్ అధికారుల సహకారంతో స్తంభాలను తొలగిస్తాము .ఇలాంటి సమస్యలు మరల పునరావృతం కానివ్వం అని మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు