Homeసినిమాజపాన్‌లో ‘మిరాయ్’ జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతున్న తేజ సజ్జా సినిమా!

జపాన్‌లో ‘మిరాయ్’ జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతున్న తేజ సజ్జా సినిమా!

యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు జపాన్ మార్కెట్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. శుక్రవారం జపాన్‌లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

విడుదలకు ముందే ‘మిరాయ్’కు జపాన్‌లో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా పలు క్రేజీ రికార్డులను అధిగమించింది. ‘బాహుబలి 2’, ‘టైగర్ జిందా హై’ వంటి సినిమాలను దాటి, జపాన్‌లో భారతీయ చిత్రాల డే-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో టాప్-10లో ఏడో స్థానాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.

జపాన్‌లో తెలుగు సినిమాలకు పెరుగుతున్న క్రేజ్

భారతీయ సినిమాలకు, ముఖ్యంగా తెలుగు చిత్రాలకు జపాన్‌లో ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడుతోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి చిత్రాలు అక్కడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘మిరాయ్’పై కూడా జపాన్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

వసూళ్లలోనూ ‘మిరాయ్’ దూకుడు

దేశీయంగా కూడా ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.111.92 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో 2025లో మంచి వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ‘మిరాయ్’ కూడా ఒకటిగా నిలిచింది.

ఇప్పుడు జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడి బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే మంచి జోరు చూపిస్తున్న ‘మిరాయ్’, థియేటర్లలోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి.

also read: నాగపంచమి వేళ వింత ఆచారం.. గడ్డి తింటున్న 70 ఏళ్ల వృద్ధుడు.. చూసేందుకు పోటెత్తిన జనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు