మునుగోడు, క్రైమ్ మిర్రర్: ప్రపంచ కార్మికుల పండుగ రోజు అయిన మే 1న 141మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురజా రామచంద్రం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో సీపీఐ మండల పార్టీ కార్యాలయంలో బండమీది యాదయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా గురుజ రామచంద్రం పాల్గొని మాట్లాడారు.
1881లో అమెరికా నడిబొడ్డున చికాకో నగరంలో లక్షలాది మంది కార్మికులు ప్రాణాలర్పించి రక్తం చిందించి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి.అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను హరించి వేస్తూ 44 చట్టాలను . 4. లేబర్ కోడ్లు గా విభజించి 12 గంటలు పనిని పొడిగిస్తూ కార్మికుల శ్రమను దోపిడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని .మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్న మతతత్వ బిజెపి పార్టీని గద్దె దిగేవరకు అన్ని కార్మిక సంఘాలు ఏకం కావాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఆర్టీసీ సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలనిడిమాండ్ చేశారు .తీర్పారి వెంకటేశ్వర్లు,చాపల శ్రీను,వనం వెంకన్న,పాండు,దయాకర్. ఈదులకంటి కైలాస్ గోస్కొండ లింగయ్య,బెల్లం శివయ్య, ఎం. పరమేష్ శంకర్ ముంత నరసింహ, ఆనగంటి.నరసింహ, తాడికొండ సైదులు, బి ఎల్లయ్య కొండ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.