Homeతెలంగాణడ్ర‌గ్స్ విష‌యంలో ఎంత‌టివారినైన వ‌దిలేదు...సీఎం రేవంత్ రెడ్డి...!

డ్ర‌గ్స్ విష‌యంలో ఎంత‌టివారినైన వ‌దిలేదు…సీఎం రేవంత్ రెడ్డి…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా వదిలేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే హైదరాబాద్‌ను గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌గా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాల పట్ల ముఖ్యమంత్రి అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నిందుతుల‌కు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారు ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నవారైనా, ఎంత పెద్ద కుటుంబాలకు చెందిన వారైనా సరే.. చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు. ఎవరికీ రాయితీలు ఇవ్వొద్దని పోలీసులను ఆదేశించారు.

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) కు అవసరమైన నిధులు, అత్యాధునిక సాంకేతికత మరియు అదనపు సిబ్బందిని కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలు, పబ్‌లు మరియు ఫామ్‌హౌస్‌లపై నిరంతరం నిఘా ఉంచాలని, యువత డ్రగ్స్ ఊబిలో పడకుండా పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు