Homeసినిమాజై హనుమాన్‌లో మమితా బైజు.. రిషబ్ శెట్టితో కలిసి కీలక పాత్రలో!

జై హనుమాన్‌లో మమితా బైజు.. రిషబ్ శెట్టితో కలిసి కీలక పాత్రలో!

‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన మలయాళ నటి మమితా బైజు మరో భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఆమె.. తాజాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ‘హనుమాన్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న ఈ పౌరాణిక కథా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం.

మమితా బైజు ‘ప్రేమలు’తో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమెకు వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ‘జై హనుమాన్’ వంటి భారీ పౌరాణిక చిత్రంలో భాగం కావడంతో ఆమె కెరీర్ మరింత ఆసక్తికరంగా మారనుంది.

రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి, మమితా బైజు వంటి నటులు ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘జై హనుమాన్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సినిమా కథలో మమితా పాత్ర ఏ స్థాయిలో ఉండబోతోంది? ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? అనే విషయాలు మాత్రం చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

also read: “యువత కచ్ఛితంగా చూడాలి”-  ‘హనుమాన్ అంశ్’పై నిర్మాత మైత్రీ రవి కీలక వ్యాఖ్యలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు