Homeతెలంగాణపంట నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి-కవిత

పంట నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి-కవిత

  • మొక్కజొన్న పంట దహనమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

  • తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత

క్రైమ్ మిర్రర్ తెలంగాణ స్టేట్ బ్యూరో: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్టలో ప్రమాదవశాత్తు వంద ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట దహనం అవడంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పంట దహనమై నష్టపోయిన రైతులతో హైదరాబాద్ నుంచి కవిత ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీఆర్ఎస్ నాయకులు బానోత్ మౌనికతో కలిసి బాధిత రైతులతో ఫోన్ లో మాట్లాడారు.

పంట నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని.. పంట నష్టం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా ఒత్తిడి చేస్తామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న పంట దహనమై నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని, పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు