Homeఅంతర్జాతీయంరాజ్యసభకు మంద కృష్ణ మాదిగ...!

రాజ్యసభకు మంద కృష్ణ మాదిగ…!

  • ఏపీ నుంచి పంపించాలని బిజెపి నిర్ణయం

  • తెలంగాణలో ఎస్సీ ఉపకులాల ఓట్లపై గురి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. అక్కడ ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో రావాలన్నదే ఆ పార్టీ లక్ష్యం. అందులో భాగంగా మందకృష్ణ మాదిగ కు బిజెపి కీలక పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మంద కృష్ణ మాదిగ బిజెపికి అనుకూలంగా ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు చేయడంతో బిజెపి పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగకు రాజ్యసభ పదవి ఇచ్చి తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని బిజెపి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా ఏపీ నుంచి రాజ్యసభకు మందకృష్ణ మాదిగను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది తెలంగాణలో బిజెపికి.. ఏపీలో కూటమికి రాజకీయ ప్రయోజనం చేకూర్చుతుందని కేంద్ర పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య కు రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ కు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మాదిగ ఓటు బ్యాంకు పై బిజెపి గురిపెట్టినట్లు తెలుస్తోంది.

సుదీర్ఘ పోరాటం ఫలితం…
మంద కృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఎస్సీ వర్గీకరణ జరిగింది.. దీనిపై బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు మందకృష్ణ మాదిగ. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో కూడా ప్రత్యేక కృతజ్ఞతలతో ఉన్నారు. అయితే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం అధికం. ఎస్సీల్లోనే అధిక భాగం ఆ సామాజిక వర్గానిది. అందుకే బిజెపి పెద్దలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఏపీలో కాళీ కాబోయే రాజ్యసభకు మంద కృష్ణ మాదిగకు పంపిస్తారని టాక్ నడుస్తోంది. మొన్నటి వరకు ఏపీ బిజెపి రాజ్యసభ అభ్యర్థిగా తమిళనాడు నేత అన్నామలై పేరు వినిపించింది. అయితే 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని.. మంద కృష్ణ మాదిగ కు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది.

భారీ ఉద్యమం దిశగా..
ఉమ్మడి ఏపీలోనే మందకృష్ణ మాదిగ ఉద్యమ చరిత్ర కలిగిన నేతగా గుర్తింపు పొందారు. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాటం ప్రారంభం అయింది. స్వల్ప కాలంలోనే ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. అయితే సుదీర్ఘకాలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఎస్సీ వర్గీకరణ కోసం గట్టి పోరాటం చేశారు మందకృష్ణ మాదిగ. అయితే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలను గౌరవించి అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మంద కృష్ణ మాదిగ పోరాటాన్ని గుర్తించి ఆయనను అభినందనలు తెలిపారు. ఆత్మీయ ఆలింగణం కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు కృష్ణ మాదిగకు రాజ్యసభకు ప్రమోట్ చేసి తెలంగాణలో మాదిగ ఓట్లు పై గురి పెట్టింది భారతీయ జనతా పార్టీ. త్వరలో ఏపీ నుంచి భర్తీ అయ్యే రాజ్యసభ సీటును మందకృష్ణ మాదిగకు కేటాయించడం ఖాయంగా తెలుస్తోంది.

మూడు ఎన్నికల్లో పోటీ..
ఇంతవరకు మందకృష్ణ మాదిగ చట్టసభలకు ఎన్నిక కాలేదు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. దాదాపు పాతిక వేలకు పైగా ఓట్లు సాధించారు మందకృష్ణ మాదిగ. 2009లో అయితే మరోసారి పోటీ చేసి 20 వేల ఓట్లకు పైగా సాధించారు. 2014 ఎన్నికల్లో మహాజన సోషలిస్ట్ పార్టీని స్థాపించి తెలంగాణలోని వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాదాపు 20 వేలకు పైగా ఓట్లు సాధించారు. తెలంగాణలో బలమైన నెట్వర్క్ ఉంది మంద కృష్ణ మాదిగకు.

ఏపీలో సైతం మాదిగ సామాజిక వర్గంతో పాటు ఎస్సి ఉపకు లాల్లో మంచి పట్టు ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఆయనపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి పార్లమెంటుకు పంపించడం ఖాయంగా సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు