Homeక్రైమ్ఫాంహౌస్‌లో దోపిడీకి దుండగుల యత్నం.. వాచ్‌మెన్‌ దారణ హత్య

ఫాంహౌస్‌లో దోపిడీకి దుండగుల యత్నం.. వాచ్‌మెన్‌ దారణ హత్య

క్రైమ్ మిర్రర్ :  ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి దుండగులు హల్‌చల్‌ చేశారు. ఫాంహౌస్‌లోకి చొరబడి దోపిడీకి ప్రయత్నించిన దుండగులు.. అడ్డుకున్న వాచ్‌మెన్‌ను హత్య చేసి, అనంతరం నాటు బాంబులు విసరడంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్తూరు రూరల్‌ మండలం మంగాపురానికి చెందిన పట్టాభి నాయుడు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. స్వగ్రామంలోని తన మామిడి తోటలో ఆయన ఫాంహౌస్‌ను నిర్మించుకున్నారు. దాని నిర్వహణ బాధ్యతలను ఆయన సోదరి విజయ, బావ వెంకటేష్‌ నాయుడు చూసుకుంటున్నారు.

అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు ఫాంహౌస్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా అక్కడ ఉన్న రెండు కుక్కలకు మత్తు మందు ఇచ్చి.. అనంతరం దోపిడీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న వాచ్‌మెన్‌ ఆనందరావు (52) వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో దుండగులు ఆనందరావుపై దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఫాంహౌస్‌ కిటికీపై నాటు బాంబులు విసిరారు. బాంబుల శబ్దంతో భయాందోళనకు గురైన విజయ, వెంకటేష్‌ దంపతులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఫాంహౌస్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: అరుణాచల్‌పై ఆందోళన.. ‘చైనా ఆక్రమణలు పెరుగుతున్నాయి’ అంటూ యువకుడి వీడియో వైరల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు