Homeతెలంగాణనేడే జనసేన 'తెలంగాణ నవనిర్మాణ' సభ...!

నేడే జనసేన ‘తెలంగాణ నవనిర్మాణ’ సభ…!

  • తీవ్ర విమర్శలు చేస్తున్న తెలంగాణ నేతలు

  • అడ్డుకోవాలి అంటూ జనసైనికుల సవాల్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ నవనిర్మాణ బహిరంగ సభ పై పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మంగళవారం హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ నేపథ్యంలో కొంతమంది తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ జనసేన నేతలు క్రియాశీలకం అయ్యారు. తెలంగాణ నవనిర్మాణ నిర్మాణం పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అయితే దీనిపై తెలంగాణ రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి.

కల్వకుంట్ల కవిత విమర్శలు..
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ నవనిర్మాణ సభ ఏర్పాటు పై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు తెలంగాణ రక్షణ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఏపీకి రాజధాని కట్టలేని వారు.. తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఆంధ్ర వారి పెత్తనం ఏంటని ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రజలతో తమకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. కేవలం నాయకులతో మాత్రమేనని తేల్చేశారు. సినిమాలు నటించుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారులతోపాటు పారిశ్రామికవేత్తలు వస్తే ఆహ్వానిస్తాం అని చెప్పారు. నాయకులను మాత్రం తెలంగాణలో విడిచిపెట్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత.

గట్టిగానే బదులిస్తున్న జనసేన..
మరోవైపు తెలంగాణ జనసేన నేతలు గట్టి అల్టిమేట్ ఇస్తున్నారు. తెలంగాణ నవనిర్మాణ సభను అడ్డుకోవాలని సవాల్ చేశారు. ఎలా అడ్డుకుంటారో చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్లో కొంతమంది జర్నలిస్టులు, మేధావులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

తరువాత అదే ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ సమాజంలో పవన్ కళ్యాణ్ ఒక విలక్షణ పాత్ర పోషించిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ సెంటిమెంటును, తెలంగాణ కళలను, సంస్కృతిని గౌరవించిన వైనాన్ని ప్రస్తావించారు. ఆధారాలతో సహా వివరాలను వెల్లడించారు.

పక్కా వ్యూహంతోనే తెలంగాణలో తెలంగాణ నవనిర్మాణ సభను ఏర్పాటు చేస్తోంది జనసేన. త్వరలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవనిర్మాణ సభ ద్వారా గట్టి సవాల్ విసరాలని చూస్తోంది జనసేన. రేపటి సభలో తప్పకుండా సంచలనాలు నమోదు అవుతాయని అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో??

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు