విజయవాడ, క్రైమ్‌మిర్రర్: కరోన మహమ్మారి మళ్లీ కలలకం రేపుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది కూటమి సర్కార్. విజయవాడ జీజీహెచ్ లో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.15 బెడ్లతో ఐసీయూ ఏర్పాటు చేశారు అధికారులు.కొవిడ్ కిట్లు, ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచామని 10 మంది వైద్యుల బృందం, సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు అధికారులు. కొవిడ్ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
Also Read:కొత్తపల్లిలో విషాదం.. బావిలో పడి తల్లి, కుమార్తె మృతి
అధికారులు. జీజీహెచ్ నుంచి ఇప్పటివరకూ 46 శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామని 46 మందిలో ఎవరికీ కొవిడ్ పాజిటివ్ రాలేదని స్పష్టం చేశారు అధికారులు.ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోవిడ్ మెడిసిన్ అందుబాటులో ఉంచామని..జ్వరం,జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో ఎవరొచ్చినా రెగ్యులర్ ఓపీ కాకుండా కొవిడ్ వార్డుకు తరలిస్తున్నామని తెలిపారు అధికారులు. ఇక్కడే ప్రత్యేకంగా కొవిడ్ కోసం ఓపీ ఏర్పాటు చేశామని..ఏ సమయంలోనైనా ఓపీ సేవలు అందించేలా కోవిడ్ వార్డులో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు అధికారులు. కాగా గడిచిన రెండు వారాల్లో కరోనా లక్షణాలతో నలుగురు మరణించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
Also Read:మహిళపై అసభ్య ప్రవర్తన.. యువకుడిని చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు