-
రంగంలోకి ఢిల్లీ పెద్దలు
-
ఇరువురు నేతలతో చర్చలు జరుపుతున్న కీలక నాయకులు
-
వినకపోతే వేటు తప్పదని హై కమాండ్ హెచ్చరిక
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పై బిజెపి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముందుగా నేతల మధ్య విభేదాలను పరిష్కరించే అడుగులు వేస్తోంది. ప్రధానంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య రాజీ కుదుర్చేందుకు బిజెపి హై కమాండ్ పెద్దలు రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి వచ్చిన సునీల్ బన్సల్, అభయ్ పటేల్ ఆ ఇద్దరు నేతల మధ్య రాజీ ఫార్ములా ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. బిజెపి హై కమాండ్ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆ ఇరువురు నేతలకు ఉపదేశించినట్లు సమాచారం. ఇద్దరు బలమైన నేతలు కావడంతో.. వారిద్దరి మధ్య సయోధ్య ఏర్పరచి.. వచ్చే ఎన్నికల్లో వారి సేవలను వినియోగించుకోవాలని హై కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
గత కొంతకాలంగా విభేదాలు…
Also Read:వివాహేతర సంబంధం మోజులో దారుణం.. కన్న కొడుకుపై ప్రియుడుతో కలిసి తల్లి దాడి
గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీలో ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య డైలాగ్ వార్ నడుస్తూ వచ్చింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రీతిలో విభేదాలు ఏర్పడ్డాయి. అయితే అవి పార్టీని వీధిన పడేసే స్థాయికి చేరుకోవడంతో హై కమాండ్ గుర్తించింది. ఇద్దరు నేతలకు కీలక సూచనలు చేసింది. అయినా సరే వారి వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. అందుకే పార్టీ అధిష్టానం నేరుగా ఢిల్లీ నుంచి ఇద్దరు నేతలను పంపించి సయోధ్య ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ వారి వైఖరిలో మార్పు రాకపోతే తగ్గిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు పంపినట్లు సమాచారం.
-
తెలంగాణ పై ఫోకస్…
Also Read:అల్లు అర్జున్‌తో మూవీపై మల్లు డైరెక్టర్ క్రేజీ హింట్.. డైరెక్టర్ పోస్ట్ వైరల్…!
బెంగాల్లో బిజెపి విజయం తరువాత.. తమ తదుపరి టార్గెట్ తెలంగాణ అని హైకమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో పర్యటించారు. ఇక్కడి పరిస్థితులను గుర్తించి అమిత్ షా తో కీలక చర్చలు జరిపారు. అమిత్ షా ఆదేశాలతోనే ఢిల్లీ నుంచి ఇద్దరు నాయకులు తెలంగాణకు వచ్చినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఉన్నారు. బీసీ నేత. గులాబీ పార్టీ నుంచి వచ్చి బిజెపిలో చేరారు ఈటెల రాజేందర్. ఆయన సైతం వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు. ముందుగా ఇద్దరు నేతల మధ్య సయోధ్య ఏర్పాటు చేసి.. సీనియర్లందరినీ ఏకతాటిపైకి తెచ్చి.. బిజెపి తెలంగాణలో ముందుకెళ్లాలని చూస్తోంది. మరి ఈ రాజీ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.