Homeక్రైమ్నల్లగొండలో విషాదం.. మెడికల్ విద్యార్థిని మృతి, అనుమానిత యువకుడి ఆత్మహత్యతో కలకలం

నల్లగొండలో విషాదం.. మెడికల్ విద్యార్థిని మృతి, అనుమానిత యువకుడి ఆత్మహత్యతో కలకలం

నల్లగొండ జిల్లాలోని కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా, ఈ ఘటనకు సంబంధించి అనుమానం వ్యక్తం చేసిన యువకుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు సమాచారం. ఆమె ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

లక్ష్మీ ప్రసన్న మృతిపై కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే చరణ్ కూడా శనివారం తాటి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు.

ప్రాథమిక సమాచారం ప్రకారం లక్ష్మీ ప్రసన్న, చరణ్ మధ్య కొంతకాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మరణాలకు గల అసలు కారణాలు ఏమిటనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. పాముతో కాటు వేయించి భర్తను హత్య చేసిన భార్య!

తాజావార్తలు