Homeఆంధ్ర ప్రదేశ్పోలవరంపై సీఎం చంద్ర‌బాబు మాస్ట‌ర్‌ప్లాన్‌...!ప‌ర్యాట‌కంగా తీర్చిదిద్దేందుకు స‌న్న‌హాలు...

పోలవరంపై సీఎం చంద్ర‌బాబు మాస్ట‌ర్‌ప్లాన్‌…!ప‌ర్యాట‌కంగా తీర్చిదిద్దేందుకు స‌న్న‌హాలు…

రాజమండ్రి,క్రైమ్‌మిర్ర‌ర్‌: ఆంధ్రప్రదేశ్‌లో పోలవరానికి పర్యాటక శోభను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యామ్‌తోపాటు గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంతోపాటు ప్రాజెక్టు దిగువన, ఎగువన టూరిజం డెవల్మెంట్‌కు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం శాఖ అధికారలుతో పాటు ఏజెన్సీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు.నదీతీరం వెంట టూరిజం ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ డిజైన్, స్పిల్ వే బ్యూటిఫికేషన్ సహా మాస్టర్ ప్లాన్‌పై చర్చించారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్దిలో అనుభవం ఉన్న నిప్పాన్ కోయి సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు.

Also Read: Read:హైదరాబాద్‌లో నా జ్ఞాపకాలు అక్కడే.. జెనీలియా ఎమోషనల్ పోస్ట్…!

పోలవరం ప్రాజెక్టు సమీపంలో నదికి ఇరువైపులా పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటుపై చర్చించారు.పోలవరం ప్రాజెక్టు ఎగువున భద్రాచలం సమీపం వరకు ఏపీ భూభాగంలో టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమృద్ధిగా నీటి వనరులు, పచ్చని కొండలు, అటవీ ప్రాంతాలతో మంచి పర్యాటక ప్రాంతంగా పోలవరం మారుతుందని సీఎం అన్నారు. ఎకో టూరిజం, రాక్ క్లైంబింగ్, వెల్‌నెస్ సెంటర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటికి అనుకూలంగా మార్చాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పర్యాటక రంగంలోనూ పోలవరాన్ని ప్రత్యేకంగా నిలపేలా చేయాలన్నారు.ఇంజనీరింగ్ టూరిజం, రివర్ ఫ్రంట్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం డెవల్మెంట్‌కు ఈ ప్రాంతం అత్యంత అనుకూలమన్న ఏజెన్సీ.. వాటర్ స్పోర్ట్స్‌కు సమృద్ధిగా అవకాశాలు ఉన్నాయని వివరించింది. స్పిల్ వే దిగువున నది మధ్యలో 500 ఎకరాల ఐ లాండ్ స్థలాన్ని అభివృద్ది చేసే విషయంలో పలు డిజైన్లు ప్రతిపాదనలను అందించారు.

Also Read:వివాహేతర సంబంధం మోజులో దారుణం.. కన్న కొడుకుపై ప్రియుడుతో కలిసి తల్లి దాడి

అలాగే మధ్యలో ఉండే వాటర్ బాడీలు, కొండలను పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను సంస్థ ప్రతినిధులు వివరించారు. స్పిల్ వే దిగువన కేబుల్ బ్రిడ్జ్ డిజైన్లపైనా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐలాండ్‌గా ఉన్న ప్రాంతంతో పాటు చుట్టుపక్కల మొత్తం 1,500 ఎకరాల్లో తీసుకురాదగిన ప్రాజెక్టులపై నిప్పాన్ కోయి సంస్థ ప్రజెంటేషన్‌లో పలు ప్రతిపాదనలు చేసింది.ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడంతో పాటు…పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, స్థానికంగా ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు తీసుకువస్తామని సీఎం స్పష్టం చేశారు. అధికారులు ఆమేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు