-
బిజెపికి అన్నామలై గుడ్ బై…?!
-
తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తమిళనాడు బీజేపీ నేత అన్నామలై తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? ఆయన బిజెపికి గుడ్ బై చెబుతారా? సొంత పార్టీని ఏర్పాటు చేస్తారా? అందుకే బిజెపి జాతీయ అధ్యక్షుడు అపాయింట్మెంట్ కోరారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఆయన పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీకి గుడ్ బై చెబుతారన్న టాక్ తమిళనాడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.
బిజెపిని బలోపేతం చేసిన నేత
మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై తమిళనాడులో బిజెపిని బలోపేతం చేసిన నేత. 2021 నుంచి 2025 వరకు తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీని అట్టడుగు వర్గాల నుంచి బలోపేతం చేసే పనిలో పడ్డారు. అయితే ఉన్నట్టుండి బిజెపి హై కమాండ్ ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. కేంద్ర కార్యవర్గంలోకి తీసుకుంది.
ఇంకోవైపు మొన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆయనను పార్టీ ప్రచారానికి సైతం దూరంగా ఉంచినట్లు ప్రచారం నడిచింది. ఆ ఎన్నికల్లో బిజెపికి కనీస స్థాయిలో కూడా ఓట్లు, సీట్లు రాలేదు.. అందుకే అన్నామలై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తనకంటే వెనుక రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
అదే తానే ఒక సొంతంగా పార్టీ పెట్టి ఉంటే తన పరిస్థితి మరోలా ఉండేదని అన్నామలై భావిస్తున్నట్లు సమాచారం. బిజెపికి గుడ్ బై చెప్పి సొంత పార్టీ ఏర్పాటు దిశగా అన్నమలై ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన కొత్త పార్టీ పేరు ‘మక్కల్ శక్తి ఇయకమ్మ’ అని ప్రచారం జరుగుతోంది.
త్రిభాషా విధానం పై వ్యతిరేకత..
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్రి భాషా విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అన్నామలై ఇటీవల ట్వీట్ చేశారు. అప్పటినుంచి ఆయన బిజెపికి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది సోషల్ మీడియాలో.
అన్నామలై సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తనపై జరుగుతున్న ప్రచారం ఆయనకు తెలుసు. అయినా ఆయన ఖండించలేదు. ఆపై జూన్ 3న బిజెపి జాతీయ అధ్యక్షుడు అపాయింట్మెంట్ కోరారు. దీంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకే అలా చేశారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. చూడాలి అన్నామలై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?