క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ తాజాగా “ఇన్‌స్టంట్స్” అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు యూజర్లలో కొత్త టెన్షన్‌కు కారణమవుతోంది. పొరపాటున ఒక బటన్‌ను టచ్ చేస్తే ఫోటోలు వెంటనే ఇతరులకు వెళ్లిపోతుండటంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫీచర్‌పై భారీ చర్చ జరుగుతోంది.
“ఇన్‌స్టంట్స్” ఫీచర్ ద్వారా యూజర్లు రియల్ టైమ్‌లో తీసిన ఫోటోలను తమ క్లోజ్ ఫ్రెండ్స్ లేదా మ్యూచువల్ ఫాలోవర్లకు వెంటనే షేర్ చేయవచ్చు. ఈ ఫోటోలు ఒకసారి చూసిన తర్వాత మాయమవుతాయి. 24 గంటల తర్వాత పూర్తిగా కనిపించవు. అయితే ఇందులో ప్రధాన సమస్య ఏమిటంటే.. ఫోటోను ముందుగా ప్రివ్యూ చూసే అవకాశం లేకపోవడం. కెమెరా బటన్ నొక్కిన వెంటనే ఫోటో నేరుగా షేర్ అయ్యే అవకాశం ఉండటంతో పొరపాటున వ్యక్తిగత ఫోటోలు కూడా ఇతరులకు వెళ్లిపోవచ్చని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంకా ఈ ఫీచర్‌లో ఫోటోలను ఎడిట్ చేసే అవకాశం కూడా ఉండదు. కేవలం క్యాప్షన్ మాత్రమే జోడించవచ్చు. దీంతో ఆలోచించకుండా పంపిన ఫోటోలు తర్వాత ఇబ్బందులకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత, టీనేజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.అయితే పొరపాటున షేర్ చేసిన ఫోటోను కొద్ది సెకన్లలో “అన్‌డూ” చేసే అవకాశం మాత్రం ఉందని సంస్థ తెలిపింది. అలాగే ఈ ఫీచర్‌ను పూర్తిగా ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి “కంటెంట్ ప్రిఫరెన్సెస్” ఎంపికలో “హైడ్ ఇన్‌స్టంట్స్ ఇన్‌బాక్స్” ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి. అలాగే DM ఇన్‌బాక్స్‌లో కనిపించే ఇన్‌స్టంట్స్‌పై లాంగ్ ప్రెస్ చేసి “స్నూజ్” చేయవచ్చు.
ఇప్పటికే చాలామంది యూజర్లు ఈ ఫీచర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ప్రైవసీకి ముప్పు”, “అత్యంత కన్ఫ్యూజింగ్ ఫీచర్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఫోటో తీసిన వెంటనే ఇతరులకు వెళ్లిపోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.అందుకే ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించే ముందు పూర్తిగా అర్థం చేసుకుని జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.