Homeక్రైమ్తండ్రి అంత్యక్రియల ఖర్చులపై అన్నదమ్ముల మధ్య గొడవ.. అన్నను కత్తెరతో పొడిచి తమ్ముడు పరార్

తండ్రి అంత్యక్రియల ఖర్చులపై అన్నదమ్ముల మధ్య గొడవ.. అన్నను కత్తెరతో పొడిచి తమ్ముడు పరార్

చంపాపేట్‌ కుమ్మరిబస్తీలో కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. తండ్రి అంత్యక్రియలకు సంబంధించిన ఖర్చుల విషయంలో అన్నదమ్ముల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు సమాచారం.

ఈ క్రమంలో తమ్ముడు వెంకటేశ్ తన అన్న శివపై కత్తెరతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన శివను ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు, స్థానికులు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం.

ఘటన అనంతరం వెంకటేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

also read: ఫౌజీ నుంచి ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆసక్తికర పోస్టర్

తాజావార్తలు