Homeసినిమాత్రిష సంచలన పోస్ట్.. ‘ఇంత నాటకం సిగ్గుచేటు’ అంటూ షాకింగ్ కామెంట్స్

త్రిష సంచలన పోస్ట్.. ‘ఇంత నాటకం సిగ్గుచేటు’ అంటూ షాకింగ్ కామెంట్స్

సినీ నటి త్రిష మరోసారి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా సినీ, రాజకీయ అంశాలకు సంబంధించిన వివాదాల్లో ఆమె పేరు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా త్రిష చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌పై నెటిజన్లు ఆసక్తిగా చర్చిస్తున్నారు.

తాజాగా త్రిష ఓ పోస్ట్‌లో.. “ఈ వయసులోనూ ఇంత నాటకం సిగ్గు చేటు. పోయి డబ్బు సంపాదించి ప్రశాంతంగా జీవించండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయాన్ని ఆమె స్పష్టంగా వెల్లడించలేదు.

దీంతో త్రిష తాజా పోస్ట్‌పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఆమె వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేశాయనే దానిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల త్రిషకు సంబంధించిన పలు అంశాలు సోషల్ మీడియాలో చర్చకు రావడంతో ఈ పోస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే త్రిష మాత్రం తన తాజా వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యక్తి లేదా సందర్భాన్ని స్పష్టంగా చెప్పకపోవడంతో.. అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. దీనిపై ఆమె నుంచి మరింత వివరణ వస్తుందా లేదా అనేది చూడాలి.

also read: అల్లు అర్జున్ స్వాతంత్య్ర దినోత్సవ ట్వీట్‌పై వివాదం.. నెటిజన్ల విమర్శలతో పోస్టు డిలీట్?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు