Homeలైఫ్ స్టైల్ఆహారం సరిగా నమలకుంటే ముప్పే: వైద్యుల హెచ్చరిక!

ఆహారం సరిగా నమలకుంటే ముప్పే: వైద్యుల హెచ్చరిక!

క్రైమ్ మిర్రర్,హెల్త్:- వేగంగా మారుతున్న జీవనశైలిలో, చాలామంది ఆహారాన్ని త్వరగా తినేస్తూ ఉంటారు. అయితే, ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.మనం ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగేయడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకుంటామని, దీని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, జీర్ణక్రియ సంబంధిత సమస్యలైన అజీర్ణం, గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వివరించారు.సరిగ్గా నమలని ఆహారం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉందట. కాలేయంపై అదనపు భారం పడటంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలకు ఇది దారి తీస్తుందని వైద్యులు హెచ్చరించారు.

వైద్యుల సూచనలు:- ఈ సమస్యలను నివారించడానికి వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.ఆహారాన్ని చిన్నచిన్న ముద్దలుగా తీసుకోవాలి.మింగే ముందు ఆహారాన్ని బాగా నమలాలి.భోజనం చేయడానికి కనీసం 20 నిమిషాల సమయం కేటాయించాలి.ఆరోగ్యకరమైన జీవనానికి, ఆహారాన్ని ఆస్వాదిస్తూ, నెమ్మదిగా తినడం చాలా ముఖ్యం అని వైద్యులు సూచిస్తున్నారు.

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా రెడీ..!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నాకు తీవ్ర గాయం.. అసలు ఈ ‘టెండన్ డిటాచ్‌మెంట్’ అంటే ఏమిటి?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు