క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్:- విడుదలైన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత యువ సంచలనం ఇషాన్ కిషన్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుతమైన ఫామ్‌తో చెలరేగుతున్న ఇషాన్, ఏకంగా 876 రేటింగ్ పాయింట్లతో అగ్ర పీఠాన్ని అధిరోహించాడు.ఇప్పటివరకు టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగిన మరో భారత యువ కెరటం అభిషేక్ శర్మ, 869 పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయాడు. టాప్-10లో భారత్ తరపున యువ బ్యాటర్ తిలక్ వర్మ 4వ స్థానంలో నిలవగా, డ్యాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 8వ స్థానాన్ని దక్కించుకున్నాడు. బ్యాటర్లే కాకుండా బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏకంగా 3వ ర్యాంక్‌తో అదరగొట్టగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 6వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా మూడు స్థానాల్లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిలిచారు.టెస్టుల్లోనూ టాప్-10లో ఇద్దరుటెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ భారత్ తరపున ఇద్దరు ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 6వ స్థానంలో, యశస్వి జైస్వాల్ 9వ స్థానంలో కొనసాగుతున్నారు.
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య…! గుండెపోటుతో మరణించినట్లు నాటకం…
రూ.183.50 తగ్గిన ధరలు.. నేటి నుంచే అమలు!