Homeతెలంగాణబీజేపీలో వర్గపోరుపై అధిష్ఠానం ఫోకస్...!

బీజేపీలో వర్గపోరుపై అధిష్ఠానం ఫోకస్…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: తెలంగాణ రాష్ర్టంలో బీజేపీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త విభాల‌పై కేంద్ర అధిష్టానం దృష్టి సారించింది. దీంతో గ్రూపులు, వర్గ రాజకీయాలకు దూరంగా ఉండి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్, ఇతర కేంద్ర నాయకులు రాష్ట్ర నేతలతో సమావేశమై, “క్యాంపులు (గ్రూపులు) కాదు… బూత్‌లు నిర్మించండి” అనే సందేశాన్ని ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాయకులు వ్యక్తిగత వర్గాలను పెంచుకోవడం కంటే ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ సంస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

Also Read:భారీ వ‌ర్షా సూచ‌న‌..! ఆ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌…!

ఇటీవలి కాలంలో కొందరు నేతల మధ్య విభేదాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల వివాదాలు, పరస్పర విమర్శలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని అధిష్ఠానం భావిస్తోంది. ఈ పరిస్థితి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, అలాగే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నాయకత్వం ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల, శక్తికేంద్రం, బూత్ కమిటీల వరకు సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రతి నాయకుడు జిల్లాల పర్యటనలు నిర్వహిస్తూ కార్యకర్తలతో నిరంతరం మమేకం కావాలని, హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టాలని సూచించారు.

Also Read:OG 2 లో ఆమెకే ఛాన్స్…!

అదే సమయంలో పార్టీ కార్యకలాపాలపై కేంద్ర నాయకత్వం క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించనుంది. బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు, ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలు, శక్తికేంద్రాల బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Also Read:Tirupati to Rameswaram: IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ…!

తాజావార్తలు