HomeUncategorizedవైయస్ షర్మిల కు హై కమాండ్ షాక్ ...! జీవీ హ‌ర్ష‌కుమార్‌కు ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు....?

వైయస్ షర్మిల కు హై కమాండ్ షాక్ …! జీవీ హ‌ర్ష‌కుమార్‌కు ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు….?

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష మార్పు ఉంటుందా? షర్మిల ను పక్కన పెడతారా? ఏఐసీసీలోకి తీసుకుంటారా? అలా అయితే పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెడతారు?? ఏపీలో దీనిపైనే చర్చ నడుస్తోంది. అయితే ప్రముఖంగా అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ పేరు వినిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారు హర్ష కుమార్.. మొన్న ఆ మధ్య జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపినట్లు ప్రచారం నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. ఆ పార్టీ రాష్ట్ర సారధ్య బాధ్యతలు తీసుకుంటారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

రెండున్నర ఏళ్లుగా షర్మిల…

Also Read:ప్రధాని మోదీ రూ.5 వేల నగదు ఇస్తున్నారా? వైరల్ ప్రచారంపై కేంద్రం క్లారిటీ

ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఆమె అధ్యక్షురాలిగా కొనసాగుతూ వచ్చారు. అయితే ఆమె వల్ల పార్టీకి ఎంత మాత్రం కలిసి రావడం లేదు. కాంగ్రెస్లో పని చేసేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. ఓట్లతో పాటు సీట్లు పెరగడం లేదు. పైగా రెండున్నర సంవత్సరాల కాలపరిమితి పూర్తి కావడంతో ఆమెను మార్పు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పైగా సీనియర్లు పెద్ద ఎత్తున ఆమెపై హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది. అందుకే ఆమె మార్పు అనివార్యం అని సమాచారం. అయితే ఆమె స్థానంలో వెనుకబడిన తరగతులకు చెందిన కిల్లి కృపారానికి అవకాశము ఇస్తారని ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు జీవి హర్షకుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

సుదీర్ఘ నేపథ్యం…

Also Read:ఆకాశంలో మువ్వన్నెల జెండా.. డ్రోన్‌తో వినూత్న దేశభక్తి ప్రదర్శన

జీవీ హర్ష కుమార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. 1984లో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. 2004, 2009లో మాత్రం అమలాపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళింది. కానీ హర్ష కుమార్ మాత్రం అదే పార్టీని నమ్ముకుంటూ వస్తున్నారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో దళిత వర్గానికి చెందిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జీవీ హర్ష కుమార్ కు అభయం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో హర్ష కుమార్ కు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు కట్టబెట్టి అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు