Homeతెలంగాణప‌శ్చిమ బెంగాల్ వ్యూహాలు తెలంగాణ‌లో ప‌ని చేయ‌వు....! సీఎం రేవంత్ రెడ్డి...

ప‌శ్చిమ బెంగాల్ వ్యూహాలు తెలంగాణ‌లో ప‌ని చేయ‌వు….! సీఎం రేవంత్ రెడ్డి…

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో అనుసరించిన రాజకీయ వ్యూహాలను తెలంగాణలో అమలు చేయాలని చూస్తోందని, అయితే అలాంటి వ్యూహాలు ఇక్కడ విజయవంతం కావని అన్నారు.

Also Read:పొలంలో బయటపడ్డ బంగారం- వరంగల్ లో అరుదైన సంఘటన.. ప్రజల్లో పెరిగిన ఉత్కంఠ

ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యవంతులని, మతం లేదా విభజన రాజకీయాల కంటే అభివృద్ధి, సంక్షేమం, పాలనకు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. అందువల్ల బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన ఎన్నికల వ్యూహాలను ఇక్కడ అమలు చేయాలని ప్రయత్నించినా ప్రజలు వాటిని అంగీకరించరని వ్యాఖ్యానించారు.

Also Read:మైలార్‌దేవ్‌ప‌ల్లిలో హృద‌య విదార‌క ఘ‌ట‌న‌…!పార్కులో ప‌సికందు మృత‌దేహం…

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా నిలుస్తుందని, బీజేపీ ఆశలు నెరవేరవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా ప్రజల మద్దతు తమకే ఉంటుందని పేర్కొన్నారు.అదే సమయంలో బీజేపీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని, ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం ఇస్తారని బీజేపీ నేతలు ప్రతిస్పందించారు.

Also Read: యాద‌గిరి గుట్ట‌కు కొత్త పాల‌క‌వ‌ర్గం ఏర్పాటు…! చిరంజీవి భార్య సురేఖ‌కు చోటు…

తాజావార్తలు