HomeUncategorizedAkshay Kumar: అక్షయ్ కుమార్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ.. రానాతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్...?

Akshay Kumar: అక్షయ్ కుమార్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ.. రానాతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్…?

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ త్వరలో ఓ తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్, రానా కలిసి తెరపై కనిపించనున్నారనే వార్తే ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది. గతంలో వీరిద్దరూ బేబీ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి ఒకే సినిమాలో కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. అయితే ఈసారి రానా పాత్ర కథలో కీలకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

Also Read:కిష్త్వార్‌లో ఘోర ప్రమాదం.. చీనాబ్ నదిలో పడిన స్కార్పియో, ఐదుగురు మృతి

ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే అక్షయ్ కుమార్, రానా, చందు మొండేటి కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కథ విషయానికి వస్తే.. ఉజ్జయిని నేపథ్యంగా సాగే ఓ చారిత్రక కథను దర్శకుడు చందు మొండేటి రూపొందించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దాదాపు 300 ఏళ్ల నాటి చరిత్రకు సంబంధించిన రహస్యాలను ఆధారంగా చేసుకుని కథను సిద్ధం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కథలో అక్షయ్ కుమార్‌తో పాటు రానా పాత్రకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.

Also Read:ఆకాశంలో మువ్వన్నెల జెండా.. డ్రోన్‌తో వినూత్న దేశభక్తి ప్రదర్శన

అక్షయ్ కుమార్ ఇప్పటికే పలు దక్షిణాది చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే తెలుగు స్ట్రెయిట్ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తే మాత్రం ఇది ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. చందు మొండేటి దర్శకత్వం, అక్షయ్ కుమార్-రానా కాంబినేషన్, చారిత్రక నేపథ్యం కలిస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు నిజమవుతాయా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు