Homeసినిమాసినిమా కోసం ఎంతో శ్రమించా: హీరో విరాట్ కర్ణ- ‘నాగబంధం’పై భారీ నమ్మకం.. డూప్ లేకుండా...

సినిమా కోసం ఎంతో శ్రమించా: హీరో విరాట్ కర్ణ- ‘నాగబంధం’పై భారీ నమ్మకం.. డూప్ లేకుండా యాక్షన్ సీన్లు!

తన కెరీర్ ప్రారంభ దశలోనే పెద్ద ప్రాజెక్ట్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని హీరో విరాట్ కర్ణ తెలిపారు. ‘పెదకాపు’ తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’పై భారీ ఆశలు పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ సినిమా కోసం తాను ఎంతగానో శ్రమించానని, ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగించేలా సినిమా రూపొందిందని వెల్లడించారు.

ఈ నెల 3న విడుదలకు సిద్ధమైన ‘నాగబంధం’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన విరాట్ కర్ణ, తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కథ వినగానే తన పాత్రపై స్పష్టమైన అవగాహన వచ్చిందని, అది తనకోసమే రాసినట్టుగా అనిపించిందని చెప్పారు. అందుకే పాత్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశానన్నారు.

ఈ సినిమాలో నాగసాధు పాత్రలో కనిపించనున్న విరాట్ కర్ణ, ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారని తెలిపారు. మేకప్‌కు రోజుకు దాదాపు ఆరు గంటలు పట్టేదని, అయినా పాత్రపై ప్రేమతో ఆ కష్టాన్ని ఆస్వాదించానన్నారు. ఒక నటుడిగా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ రావడం అరుదని, అందుకే పూర్తి అంకితభావంతో పనిచేశానని చెప్పారు.

పాత్ర కోసం ముందుగా సుమారు 20 కిలోలు బరువు పెరిగి, తర్వాత నాగసాధువుగా కనిపించేందుకు ఐదు కిలోలు తగ్గినట్టు తెలిపారు. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి పూజలు చేసినట్టు చెప్పారు. మధ్యలో అనారోగ్యం వచ్చినప్పటికీ షూటింగ్ ఆపకుండా తన పని కొనసాగించానన్నారు.

ప్రత్యేకంగా యాక్షన్ సీన్ల విషయానికి వస్తే, సినిమాలో ఒక్క సీన్‌కైనా డూప్ ఉపయోగించలేదని విరాట్ కర్ణ వెల్లడించారు. అన్ని యాక్షన్ సన్నివేశాలను తానే చేశానని, ప్రేక్షకులు వాటిని చూసి థ్రిల్ ఫీలవుతారని చెప్పారు.

దర్శకుడు అభిషేక్ నామా మాస్ పల్స్ బాగా అర్థం చేసుకునే వ్యక్తి అని, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా సినిమాను రూపొందించారని తెలిపారు. నిర్మాతలు కొత్తవారైనా కంటెంట్‌పై నమ్మకంతో భారీగా ఖర్చు పెట్టారని, ప్రమోషన్స్ కూడా మంచి స్థాయిలో చేస్తున్నారని అన్నారు.

ఇంకా ‘నాగబంధం’ సినిమాకు సీక్వెల్ కూడా ఉండే అవకాశముందని చిత్ర బృందం సూచించినట్టు విరాట్ కర్ణ తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

also read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్యను ట్రాన్స్‌ఫర్‌ చేసిన తెలంగాణ సర్కార్.. అన్యాయమంటూ మాజీ ఐపీఎస్ ఫైర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు