Homeతెలంగాణతెలంగాణ‌లో నేడు...రేపు భారీ వ‌ర్షాలు...! ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌....

తెలంగాణ‌లో నేడు…రేపు భారీ వ‌ర్షాలు…! ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌….

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు, రేపు (మంగళవారం) ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. భారీ హోర్డింగులు, పెద్ద వృక్షాల వద్ద నిలబడవద్దని ప్రజలకు సూచించింది. అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు స్పష్టం చేసింది.

Also Read:కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. ఈసారి హద్దులు దాటిన కామెంట్స్!

ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఉరుము మెరుపులతో వర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకశం ఉందని తెలిపింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. హైదరాబాద్ మహానగరంలో గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో ఎడతెగకుండా వర్షాలు కురుస్తున్నాయి.

Also Read: పశ్చిమ బెంగాల్‌లో ‘వందేమాతరం’ తప్పనిసరేనా? సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు

తాజావార్తలు