తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జీవకోన అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదుట ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఈ దాడిలో సుప్రియ అనే బాలిక తీవ్రంగా గాయపడింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను రక్షించి చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా, సుప్రియపై గతంలోనూ యాసిడ్ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లోనూ ఆమెపై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. తాజాగా మరోసారి ఆమెపై దాడి జరగడంతో కుటుంబ సభ్యులు, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా దాడికి అసలు కారణం ఏమిటి? ఈ ఘటన వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: కురుక్షేత్రలో దారుణ హత్య.. భర్తను చంపి శరీరాన్ని ఛిద్రం చేసిన భార్య!
