Homeక్రైమ్విషాదం... ఎనికేపల్లి చెరువులో రెండున్నరేళ్ల బాలుడి మృతదేహం

విషాదం… ఎనికేపల్లి చెరువులో రెండున్నరేళ్ల బాలుడి మృతదేహం

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎనికేపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి అదృశ్యమైన రెండున్నరేళ్ల బాలుడు గ్రామంలోని చెరువులో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బాలుడు ఇంటి వద్ద నుంచి కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామంలోని చెరువులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అందే నివేదిక ఆధారంగా మరణానికి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

also read: మనీషా కొయిరాలా కీలక వ్యాఖ్యలు.. హీరోల వయసుపై ప్రశ్నలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు