ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ విక్టోరియా సీక్రెట్‌లో బాలీవుడ్ నటి ట్రిప్టి డిమ్రి కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆ సంస్థకు తొలి భారత బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె ఎంపికయ్యారు. భారత ఫ్యాషన్, సినీ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ట్రిప్టికి ఇది మరో ప్రతిష్ఠాత్మక అవకాశం.
ఆగస్టు 20, 2026న ఢిల్లీలోని ఆంబియెన్స్ మాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రిప్టి డిమ్రి విక్టోరియా సీక్రెట్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ‘వెరీ స్పెషల్ కలెక్షన్’ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ట్రిప్టి.. కొన్ని ఫ్యాషన్ కలెక్షన్లు కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు స్వయం వ్యక్తీకరణకు ప్రోత్సాహం అందిస్తాయని అన్నారు. తనకు ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యం కావడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నారు.
సినిమాల విషయానికి వస్తే.. ట్రిప్టి డిమ్రి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో ఆమె బిజీగా కొనసాగుతున్నారు.
విక్టోరియా సీక్రెట్‌కు తొలి భారత బ్రాండ్ అంబాసిడర్‌గా ట్రిప్టి డిమ్రి ఎంపిక కావడం.. అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై భారతీయ సినీ తారలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని మరోసారి చాటిచెబుతోంది.
also read: మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. సెప్టెంబర్ నుంచే షూటింగ్?
