Homeసినిమామధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. సెప్టెంబర్‌ నుంచే షూటింగ్‌?

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. సెప్టెంబర్‌ నుంచే షూటింగ్‌?

బాలీవుడ్‌ దిగ్గజ నటి మధుబాల జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌పై ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో మధుబాల పాత్రను నటి సారా అర్జున్ పోషించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ‘ఫెయిరీటేల్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న జస్మీత్ కె. రీన్ ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

మధుబాల పాత్రను తెరపై సహజంగా ఆవిష్కరించేందుకు సారా అర్జున్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మధుబాల నటనా శైలి, హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ను అధ్యయనం చేస్తూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మధుబాల భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటీమణుల్లో ఒకరు. ఆమె జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనలు, సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను ఈ బయోపిక్‌లో ఏ విధంగా చూపించనున్నారనే దానిపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

also read: విజయనగరం జిల్లాలో పోలీసు వాహనం బోల్తా.. కానిస్టేబుల్ మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు