HomeతెలంగాణVidya Varotsavalu: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో  ఘనంగా విద్యా వారోత్సవాలు ముగింపు

Vidya Varotsavalu: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో  ఘనంగా విద్యా వారోత్సవాలు ముగింపు

క్రైమ్ మిర్రర్, నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండలో ప్రజా పాలన –  ప్రగతి ప్రణాళిక లో భాగంగా చివరి రోజు సాంస్కృతిక,క్రీడా కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నల్లగొండ డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్ , మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ హరీష్ కుమార్, విశ్వవిద్యాలయ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ మేయర్.. మన సంస్కృతిని, క్రీడలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలన్నారు. అవి మనకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె శ్రీనివాస రాజు మాట్లాడుతూ.. విద్యార్థులలో క్రీడా పోటీలు స్ఫూర్తిని నింపుతాయని ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నారు. సాంస్కృతి కార్యక్రమాలు మన దేశ సంస్కృతిని కాపాడుతాయని చెప్పారు. కళాశాల క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేయడం జరిగింది.  చివరగా కళాశాల విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మంజుల, సాంస్కృతిక కన్వీనర్ డాక్టర్ భూక్య వీరన్న, అమరావతి, , ప్రొఫెసర్ అరవింద, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ సునీత, డాక్టర్ జబీన్,  డాక్టర్ సుంకరి రాజారామ్, మల్లికార్జున్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు