Homeతెలంగాణభాగ్యనగరంలో వన్ వే...!

భాగ్యనగరంలో వన్ వే…!

  • హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు ప్రారంభం

  • సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థ లక్ష్యంగా రూ.1090 కోట్లతో ప్రాజెక్ట్

  • కేబీఆర్ పార్కు చుట్టూ ఆంక్షలు

  • రెండేళ్ల పాటు కష్టాలు పడాల్సిందే

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు. కేబీఆర్ పార్కు పరిసరాల్లో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ సవాళ్లు ఎదురుకానున్నాయి. సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్ సిటి ప్రాజెక్టు పనులు చేపడుతోంది.

దాదాపు రూ.1090 కోట్లతో చేపట్టనున్న పనులు రెండేళ్ల పాటు కొనసాగనున్నాయి. అందుకే ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. కోర్సిటీని ఐటి కారిడార్ తో అనుసంధానించేందుకు హెచ్ సి టి ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు.

అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. రెండేళ్ల పాటు సాగే ఈ భారీ నిర్మాణాల వల్ల నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే లక్షలాదిమంది వాహనదారులు తాత్కాలిక ట్రాఫిక్ కష్టాలు భరించక తప్పదు.

  • ట్రాఫిక్ పరిష్కారం కోసం..

భాగ్యనగరంలో నానాటికి ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. వీటికి పరిష్కారం మార్గం చూపించే ప్రయత్నంలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే జంట నగరాల్లో శాశ్వత ట్రాఫిక్ పరిష్కారం చూపేందుకు కేటీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఆరు ప్రధాన జంక్షన్ లలో.. మొత్తం ఏడు మల్టీ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్లు, ఏడు డైరెక్షనల్ అండర్ పాసులు నిర్మించనున్నారు.

వీక్ అవర్స్ లో గంటకు 15 వేలకు పైగా కార్ల సామర్థ్యంతో.. కిక్కిరిసిపోయే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, రోడ్ నెంబర్ 45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లను రెండు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు.

వీటిని నిరంతరాయంగా చేపట్టేందుకు… త్వరితగతిన సాగాలన్న ఉద్దేశంతో పోలీస్ విభాగం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో ఈ వన్డే విధానాన్ని అమలు చేస్తున్నారు.

  • అంతా గందరగోళం..

భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు గురించి తెలియంది కాదు. నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్ మార్గాల్లో ఉన్నట్టుండి రూట్లు మారడం వల్ల ప్రారంభంలో తీవ్ర గందరగోళం, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.

కాలనీ రోడ్లపై అదనపు ట్రాఫిక్ ఒత్తిడి పెరగడం, డైవర్షన్ల కారణంగా వాహనదారులు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి రావడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

అయితే మరో రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్టు పనులు జరగనుండడంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. అయితే పనులు పూర్తయితే మాత్రం ట్రాఫిక్ ఫ్రీ నగరంగా భాగ్యనగరం అవతరించే అవకాశం ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు