Homeఅంతర్జాతీయంఉప ఎన్నికల్లో విజయ్ కు ముచ్చెమటలు...!

ఉప ఎన్నికల్లో విజయ్ కు ముచ్చెమటలు…!

  • తమిళనాడులో రెండు స్థానాలకు ఎన్నికలు

  • పట్టు బిగించిన ప్రతిపక్షాలు

  • ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీవీ కే అభ్యర్థులు

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తమిళనాడులో నాలుగు నెలలకు పైగా పాలన పూర్తి చేసుకున్నారు సీఎం విజయ్. తమిళ రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికారు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల ద్వారా తన రాజకీయ పట్టు పెంచుకుంటేనే. లేకుంటే ప్రారంభంలోనే విజయ్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడం ఖాయం.

ప్రస్తుతం రాష్ట్రంలో ధరాపురం, మధురాంతకం అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం విజయ్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేయాల్సిన పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే తరఫున గెలిచిన సత్యభామ, కుమార్ వేల్ తమ పదవులకు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

అన్నా డీఎంకే లో గెలిచిన ఆ ఇద్దరు టీవీకేలోకి ఫిరాయించడంతో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా నైతికత, ప్రజా విశ్వసనీయత వంటి అంశాలు ఇక్కడ బలంగా పనిచేస్తున్నాయి. అందుకే విజయ్ తన భుజస్కందాలపై వేసుకొని మరి ఇక్కడ ఎన్నికల ప్రచారాలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.

  • అదే ప్రధాన మైనస్..

తమిళనాడు ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తామని చెప్పిన విజయ్.. అందుకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం మైనస్ గా మారింది. ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. పొంగునాడు ప్రాంతంలోని ధరాపురం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం అత్యంత ఉద్రిక్తంగా, ఉద్వేగ భరితంగా మారుతోంది.

టీవీకే అభ్యర్థిగా బరిలో దిగారు మాజీ ఎమ్మెల్యే సత్యభామ. ప్రత్యర్థి వర్గాలు తీవ్రస్థాయిలో వ్యక్తిగత, పార్టీ ఫిరాయింపు విమర్శలు గుప్పిస్తున్నాయి. బహిరంగ సభ వేదికపై ఆమె కన్నీటి పర్యాంతం కావడం, వెనుకనే ఉన్న విజయ్ ఆమెను ఓదార్చి భరోసా ఇవ్వడం తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.

ఇది పార్టీ ఫిరాయింపు కాదని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరుతున్నారని విజయ్ సమర్ధించుకుంటున్నారు. కానీ అన్న డీఎంకేతో పాటు డిఎంకెలకు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఇక్కడ గెలుపు అనేది టీవీ కేకు అంత సులువు కాదు.

  • బహుముఖ పోటీతో..

మరోవైపు మధురాంతకం నియోజకవర్గంలో బహుముఖ పోటీ ఉంది. డీఎంకే, అన్నా డీఎంకే, నామ్ తమిళర్ కచ్చి, లెఫ్ట్ కూటమిల మధ్య పోటీ భారీగా ఉంది. విజయ్ స్వయంగా హాజరై డీఎంకే అధినేత స్టాలిన్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అయితే మహిళా ఓటర్లు, స్థానిక రైతు సమస్యలు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో టీవికే క్యాడర్ అంతగా బలపడలేదు.

అందుకే విజయ్ పూర్తిగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. తన స్టార్ ఇమేజ్, వ్యక్తిగత ఆకర్షణతోనే ఇక్కడ అధిగమించాలని భావిస్తున్నారు. ఈ రెండు ఉప ఎన్నికలు డీవీకే భవిష్యత్తు రాజకీయ బలానికి అగ్నిపరీక్షగా మారాయి.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను చేర్చుకొని.. ఉప ఎన్నికలను ఎదుర్కోవడం విజయ్ కు ఇబ్బంది తెచ్చిపెడుతోంది. మరి వీటిని ఎలా అధిగమిస్తారో చూడాలి. ఈనెల 6న పోలింగ్ జరగనుండగా.. 9న ఫలితాలు రానున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు