Homeఆంధ్ర ప్రదేశ్కుటుంబాన్ని వ‌దిలేసి తిరుగుతున్న భ‌ర్త‌ను చిత‌క బాధిన భార్య‌...!

కుటుంబాన్ని వ‌దిలేసి తిరుగుతున్న భ‌ర్త‌ను చిత‌క బాధిన భార్య‌…!

కృష్ణ‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఉద్యోగం పేరుతో కుటుంబాన్ని ప‌ట్టించుకోకుండా వ‌దిలేసి తిరుగుత‌న్న భ‌ర్త‌ను అత‌డి భార్య‌, కొడుకు క‌లిసి చిత‌క‌బాదిన ఘ‌ట‌న కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం మండ‌లంలోని కేస‌ర‌ప‌ల్లి సుంద‌ర‌య్య కాల‌నీలో చోటు చేసుకుంది. దీంతో చిత‌క బాదిన భార్య పోలీసుల‌కు అప్ప‌గించింది. పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి సుందరయ్య కాలనీకి చెందిన దేవరకొండ నరేంద్రకు విజయవాడకు చెందిన ప్రియాంకకు 2012లో వివాహం జరిగింది. వీరికి 2013లో ఒక బాబు జన్మించాడు. అయితే.. కొంతకాలంగా నరేంద్ర బాబు.. భార్యను వదిలేసి, ఉద్యోగం పేరుతో హైదరాబాద్, బెంగుళూరు, దుబాయ్.. అంటూ ఇంటికి రాకుండా తిరుగుతున్నాడు. నరేంద్ర కోసం ప్రియాంక తన కుమారుడితో కలిసి చాలా చోట్ల వెతికినప్పటికీ జాడ తెలియలేదు. విసిగిపోయిన ప్రియాంక.. గతంలో నరేంద్రపై మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే క ్ర‌మంలో నరేంద్ర తమ కాలనీలోని ఓ ఇంట్లో వేరే మహిళతో ఉండగా.. ప్రియాంక కంటపడింది. దీంతో కోపంతో రగిలిపోయిన ప్రియాంక తన భర్తను చితకబాదింది. కుమారుడు కూడా తన తండ్రిపై దాడి చేశాడు. అనంతరం.. ప్రియాంక తన భర్త నరేంద్రను గన్నవరం పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ ఇవ్వనున్న అభిషేక్ శర్మ.. ముంబై, గుజరాత్ జట్లతో మంతనాలు!
  2. యువతనూ వణికిస్తున్న బ్రెయిన్ స్ట్రోక్.. ఈ ముందస్తు హెచ్చరికలు గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది!
  3. దళిత మహిళపై దాడి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు!
  4. కుటుంబ సమేతంగా తిరుమలకు వరుణ్ తేజ్.. చిన్నారి వాయువ్‌తో మెగా ప్రిన్స్ సందడి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు