Homeక్రీడలు2027 వన్డే వరల్డ్‌ గెలవడమే లక్ష్యం: రోహిత్‌

2027 వన్డే వరల్డ్‌ గెలవడమే లక్ష్యం: రోహిత్‌

 

2027 వన్డే వరల్డ్‌ కప్‌ గురించి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని… ఈ కప్‌ను గెలవడమే తన లక్ష్యమని అన్నారు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ. ఓ ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొన్న రోహిత్‌ శర్మ మాట్లాడుతూ దేశం కోసం వన్డే వరల్డ్‌ కప్‌ గెలవాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వన్డే వరల్డ్‌కప్‌కు చాలా విలువ ఉందన్నారు. కాగా, రోహిత్‌ ఇప్పటికే టీ20లు, టెస్ట్‌ ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పటికైతే వన్డేల్లో రోకో జోడీ భీకర ఫామ్‌లో ఉంది. 2027 నాటికి వీరి ఫామ్‌ ఎలా ఉంటుంది? వీరిని ఎంపిక చేస్తారా? లేదా? అన్నదానిపై పలు ఊహాగానాలున్నాయి.

తాజావార్తలు