Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో బీజేపీ బ‌లోపేతంపై దృష్టి...!

ఏపీలో బీజేపీ బ‌లోపేతంపై దృష్టి…!

  • పోల‌వ‌రంపై క్రిడెట్ తీసులేదంటూ మాధ‌వ్ హాట్ కామెంట్‌…

 

విజయవాడ, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతం కావడానికి ప్రయత్నాలు ఎన్నికలకు మూడేళ్ల ముందు ప్రారంభించినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకూ కొంత ఆలోచన చేస్తూ.. తన పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతున్న నేతలు ఇకపై రాష్ట్రాభివృద్ధిలో తమ పాత్రపైనా జనంలో చైతన్యం తెచ్చేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించిందని అనుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇటీవల బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ నేతృత్వంలో పోలవరం పర్యటనకు బయలుదేరి వెళ్లారరు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్న దశలో జాతీయ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చింది కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ అన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందుకే తాజాగా జరిగిన పార్టీ సమావేశంలోనూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read:National Film Awards 2026 Winners List: యామి గౌతమ్‌కు ఉత్తమ నటి.. ఇద్దరికి బెస్ట్ యాక్టర్.. తెలుగు సినిమాల హవా!

పోలవరంపై క్రెడిట్ తీసుకోవడంలో విఫలమయ్యామని మాధవ్ అన్నారు. అమరావతికి నిధులు, సీమకు ప్రాజెక్టులు ఇచ్చినా చెప్పుకోలేకపోయామని అనడం వారు ఇకపై కేంద్ర నిధుల ప్రస్తావన పదే పదే ప్రచారం చేస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రజల ముందు తలెత్తుకుని చెప్పుకోవాల్సిన నేతలు, ఇన్నాళ్లూ మౌనంగా ఉండటం వల్ల నష్టపోయామని బీజేపీ రాష్ట్ర నేతలు గుర్తించారు. కూటమిలో ఉంటూనే రాష్ట్రాభివృద్ధిలో తమ పాత్రను తెలియ చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే గెలిచే శక్తి ఉండాలి . సీట్లు అడగడం ముఖ్యం కాదు గెలవగలమన్న నమ్మకం పార్టీ నాయకత్వానికి కల్పించాలి. పార్టీకి ఇప్పుడే మళ్లీ మంచి వాతావరణం ఉందని, మరో స్టెప్ ఎక్కాలని భావిస్తున్నారు.

Also Read: ప్రీతి ముకుందన్ నిజంగా రామానుజన్ వారసురాలేనా?

కూటమిలో కార్యకర్తలకు అన్యాయం జరిగితే పార్టీ అండగా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అలాగే ఇకపై యాచించడం అంటూ ఏమీ ఉండకుండా శాసించే స్థాయికి ఎదగాలని, మనకు అవతలి వారి అవసరం ఎంత ఉందో.. దానికి రెట్టింపు అవసరం మనతో వారికీ ఉందని బీజేపీ నేతలు నేటికీ గుర్తించి ఇక కార్యాచరణకు సిద్ధమయ్యారు. అందుకే ఇక వరస సమావేశాలు నిర్వహించడమే కాకుండా కేంద్ర నాయకులను కూడా రాష్ట్రానికి రప్పించి పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు