భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలలో కీలకంగా గంజాయి పట్టుబడింది. రొటీన్ చెక్‌పోస్టు తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ కారును ఆపి పరిశీలించగా, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి సుమారు 100 గ్రాముల నిషేధిత గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ.5,000గా పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనలో సంబంధిత ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
also read: ఏపీలో బీజేపీ బలోపేతంపై దృష్టి…!