Homeతెలంగాణతరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య గొడవ…సర్దిచెప్పిన దర్శకుడు...!

తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య గొడవ…సర్దిచెప్పిన దర్శకుడు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్ :టాలీవుడ్‌లో ఒకప్పుడు యూత్‌కు బాగా దగ్గరైన సినిమా నువ్వు లేక నేను లేను. ఇందులో తరుణ్.. ఆర్తి అగర్వాల్ జంటగా నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ చిత్రాన్ని వైకాశీ విశ్వనాథ్ తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా కథ, పాటలు, భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలోని నిండు గోదారి కదా పాట చాలా పెద్ద హిట్ అయింది. ఈ పాటలో హీరో, హీరోయిన్ మధ్య కనిపించిన అనుభూతులు చాలా సహజంగా అనిపించాయి. అయితే ఆ పాట షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయం ఈమధ్య బయటకు వచ్చింది.

ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ..ఈ పాట చిత్రీకరణ సమయంలో తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య చిన్న గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవ కారణంగా ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకోకుండా ఉన్నారట. ఈ పరిస్థితి యూనిట్‌కు కొంచెం టెన్షన్ కలిగించిందని తెలిపారు. “ఎందుకంటే ఆ పాటలో ప్రేమ భావాలు బాగా రావాలంటే ఇద్దరూ సౌకర్యంగా ఉండాలి. కానీ వీళ్ళిద్దరూ గొడవ పడడంతో మాకు భయం వేసింది.” అంటూ చెప్పకొచ్చారు

అప్పుడు దర్శకుడు ఒక ప్లాన్ చేశారని చెప్పారు. షూటింగ్ కోసం ట్రైన్‌లో ప్రయాణం ఉండటంతో, ఆ సమయంలో ఇద్దరూ దగ్గరయ్యేలా చూసారట. ఆ ప్రయాణంలో ఇద్దరూ మళ్లీ మాట్లాడుకోవడం ప్రారంభించి, వారి మధ్య ఉన్న అపార్థాలు తగ్గించుకున్నారని తెలిపారు.

దాంతో పాట షూటింగ్ చాలా సహజంగా పూర్తి అయ్యింది. సినిమా విడుదలైన తర్వాత ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికీ ఈ పాట చాలామందికి ఇష్టమైన పాటగా నిలిచింది.

అదే సమయంలో తరుణ్, ఆర్తి మధ్య ప్రేమ ఉందనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. అవి నిజమా కాదా అన్నది స్పష్టంగా తెలియకపోయినా, దర్శకుడు చెప్పిన ఈ సంఘటన ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు